Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షర్మిలను తరిమికొడతాం: టీఆర్ఎల్ డీ

తెలంగాణ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ నేత షర్మిలకు తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ (టీఆర్ఎల్ డీ) నేతలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా షర్మిల హైదారాబాదును పాకిస్థాన్ తో పోల్చుతూ వ్యాఖ్యానించడాన్ని టీఆర్ఎల్ డీ నేత మహ్మద్ రియాజ్ తప్పుబట్టారు. ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే తరిమికొడతామని రియాజ్ హెచ్చరించారు. సీమాంధ్రలో జాతీయనేతల విగ్రహాలను కూల్చుతోంది వైఎస్సార్సీపీ కార్యకర్తలే అని, వారు అలాంటి చర్యలు ఆపకపోతే, తెలంగాణలో వైఎస్ విగ్రహాలను తాము కూల్చాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News